ఐపీఎల్ 2023లో గత సీజన్ల రికార్డులు చాలా వరకు బద్దలవుతున్నాయి. ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే పరిస్థితి ఇది. అత్యధిక వికెట్లు (చహల్), అత్యధిక సెంచరీలు (విరాట్ కోహ్లి), అత్యధిక డకౌట్‌లు (దినేశ్ కార్తీక్), 200 పరుగులకు పైగా అత్యధిక ఛేజింగ్‌లు, ఫాస్టెస్ట్ ఫిఫ్టి (యశస్వి జైస్వాల్).. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీజన్‌లో బద్దలైన రికార్డులకు అంతే లేకుండా పోతుంది.
నిన్న (మే 21) జరిగిన రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఒకే రోజు 3 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు కెమారూన్ గ్రీన్.. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్‌లు శతక్కొట్టారు. ఈ ఐపీఎల్ రికార్డుతో పాటు నిన్నటి మ్యాచ్‌లతో మరో రికార్డు కూడా బద్దలైంది.
సీజన్‌లో అత్యధిక సెంచరీల రికార్డు ఐపీఎల్ 2022 (8) పేరిట ఉండగా.. ఈ సీజన్ ఆ రికార్డును తుడిచిపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్‌లు వ్యక్తిగతంగా మరో రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వీరివురు ఐపీఎల్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన 3, 4వ ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు. అంతకుముందు శిఖర్ ధవన్, జోస్ బట్లర్ ఈ ఫీట్‌ను నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లతో ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గుజరాత్, సీఎస్‌కే, లక్నో, ముంబై ఇండియన్స్‌లు ఫైనల్ ఫోర్‌కు చేరాయి. రేపు జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్‌కే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. ఆ తర్వాత క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి.
చదవండి: గిల్ ముంబై కోసమే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment