వాంఖడే వేదికగా ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రెండు మెయిడెన్లు ఉండడం గమనార్హం.
అతడు పడగొట్టిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను షమీ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందడనంలో ఎటువంటి సందేహం లేదు.
షమీ ఓ సంచలన బంతితో గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 30 ఓవర్‌లో మూడో బంతిని అద్భుతమైన ఫుల్లర్ లెంగ్త్ డెలివరిగా షమీ సంధించాడు. షమీ బంతికి గ్రీన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 188 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో షమీతో పాటు సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Mohammad Shami the artist.#INDvsAUS #shami #TeamIndia #siraj pic.twitter.com/PmtcZBEzdC
— Azaz ahmed mogal (@azaz_mogal) March 17, 2023
చదవండి: IND vs AUS: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్ చేస్తూ సంచలన క్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment