రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలిచాడు.
స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ పేసర్లు మూకుమ్మడిగా రాణించడంతో 179 పరుగులకే కుప్పకూలింది. నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.
ఫిలిప్స్‌తో పాటు టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు ముగ్గురితో పాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు.
204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్‌మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment