విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్‌.. ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు | Tim David handed 50 over chance with ODI call up | Sakshi
Sakshi News home page

SA vs AUS: విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్‌.. ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు

Published Thu, Aug 31 2023 1:43 PM | Last Updated on Thu, Aug 31 2023 1:55 PM

Tim David handed 50 over chance with ODI call up - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు టిమ్‌ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్‌ డేవిడ్‌ పేరును ఆసీస్‌ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో డేవిడ్‌కు చోటు  దక్కలేదు. డేవిడ్‌కు కేవలం టీ20 జట్టులో మాత్రమే సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు.

అయితే ఇప్పుడు స్టీవ్‌ స్మిత్‌, మాక్స్‌వెల్‌, ‌ స్టార్క్‌ వంటి ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడంతో డేవిడ్‌కు లక్కీ ఛాన్స్‌ లభించింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో డేవిడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదేవిధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో డేవిడ్‌ కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

అతడి లిస్ట్‌-ఏ కెరీర్‌లో బ్యాటింగ్‌ సగటు 82.77గా ఉంది. ఇక ఇదే విషయంపై ఆసీస్‌ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.."టీ20 సిరీస్‌ కోసం డేవిడ్‌ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అతడికి వన్డే జట్టులో కూడా అవకాశం ఇస్తున్నాము. టిమ్‌ తన దూకుడు వన్డేల్లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక డర్బన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో  111 పరుగుల తేడాతో ప్రోటీస్‌ను కంగారూ జట్టు చిత్తు చేసింది.

దక్షిణాఫ్రికాతో వన్డేలకు ఆసీస్‌ జట్టు: పాట్ కమ్మిన్స్(కెప్టెన్‌, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ స్యాంగ్, టాన్హాన్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్‌- పాకిస్తాన్ మ్యాచ్‌ కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement