one day team
-
కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.టీమిండియాకు విలువైన ఆస్తిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్‌కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్‌తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను!దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా జూన్ 1 బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్.. ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్ డేవిడ్ పేరును ఆసీస్ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో డేవిడ్‌కు చోటు దక్కలేదు. డేవిడ్‌కు కేవలం టీ20 జట్టులో మాత్రమే సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, స్టార్క్ వంటి ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడంతో డేవిడ్‌కు లక్కీ ఛాన్స్ లభించింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదేవిధంగా లిస్ట్-ఏ క్రికెట్లో డేవిడ్ కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి లిస్ట్-ఏ కెరీర్లో బ్యాటింగ్ సగటు 82.77గా ఉంది. ఇక ఇదే విషయంపై ఆసీస్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.."టీ20 సిరీస్ కోసం డేవిడ్ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అతడికి వన్డే జట్టులో కూడా అవకాశం ఇస్తున్నాము. టిమ్ తన దూకుడు వన్డేల్లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ప్రోటీస్‌ను కంగారూ జట్టు చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ఆసీస్ జట్టు: పాట్ కమ్మిన్స్(కెప్టెన్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ స్యాంగ్, టాన్హాన్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన ఐసీసీ
2021 ఐసీసీ టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానించిన ఐసీసీ.. గంటల వ్యవధిలోనే మరోసారి టీమిండియా ఆటగాళ్లను చులకన చేసింది. తాజాగా విడుదల చేసిన మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ 2021లో కూడా భారత ఆటగాళ్లకు చోటు కల్పించకుండా చిన్న చూపు చూసింది. పైగా దాయాది పాక్ ఆటగాళ్లను మరోసారి అందలం ఎక్కించింది. పాక్ సారధి బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంచుకున్న ఐసీసీ.. వన్డే జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పగించింది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. Power-hitters, terrific all-rounders, fiery pacers 🔥 The 2021 ICC Men's ODI Team of the Year has all the bases covered 🤩 pic.twitter.com/R2SCJl04kQ — ICC (@ICC) January 20, 2022 వన్టే జట్టులో ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు జన్నెమన్ మలాన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్ డౌన్ కోసం బాబర్ ఆజమ్, నాలుగో స్థానంలో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్, ఐదో ప్లేస్‌లో సౌతాఫ్రికా చిచ్చర పిడుగు డస్సెన్‌లను ఎంచుకుంది. ఆల్‌రౌండర్ల కోటాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హాసన్, సిమి సింగ్(ఐర్లాండ్), వికెట్ కీపర్‌గా ముష్ఫికర్ రహీం(బంగ్లాదేశ్), ఏకైక స్పిన్నర్‌గా వనిందు హసరంగ(శ్రీలంక), పేసర్ల కోటాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), దుష్మంత చమీర(శ్రీలంక)లను ఎంపిక చేసింది. కాగా, నిన్న ప్రకటించిన టీ20 జట్టుకు ఓపెనర్లుగా జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్‌లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్ ఆజమ్‌ను, నాలుగో ప్లేస్‌కు మార్క్రమ్(దక్షిణాఫ్రికా), ఐదో ప్లేస్‌కు మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), ఆ తరువాత వరుసగా డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్ షంషి(దక్షిణాఫ్రికా), జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), షాహీన్ అఫ్రిది(పాకిస్థాన్)లను ఎంచుకుంది. కాగా, గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా క్రికెటర్లు ఆశించిన మేర రాణించకపోవడం వల్లే ఐసీసీ జట్లలో చోటు దక్కలేదని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం..! -
‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’
హైదరాబాద్ : సీనియర్ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్ ధోనికి టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ సముచిత గౌరవాన్ని కల్పించాడు. వన్డేల్లో తన ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టును జాఫర్ ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. తన జట్టులో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లితో పాటు ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్‌లు ఉన్నప్పటికీ ధోనికే సారథ్య బాధ్యతలను అప్పగించడం విశేషం. ఇక తన అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అయితే ఒక్క భారత బౌలర్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు వ్యవహరిస్తారి పేర్కొన్న ఈ మాజీ ఓపెనర్ బ్యాటింగ్‌లో వన్‌డౌన్ కోసం కోహ్లిని కాకుండా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవీఎన్ రిచర్డ్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పాడు. మిడిలార్డర్ పటిష్టపరచడానికి దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ మాజీ సారథి వసీం ఆక్రమతో పాటు జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్లలో సక్లాయిన్ ముస్తాక్, షేన్ వార్న్‌లలో పరిస్థితిక తగ్గట్టు ఎవరినో ఒకరు తుదిజట్టులో ఉంటాడని తెలిపాడు. ఇక ఆసీస్ దిగ్గజ సారథి రికీ పాంటింగ్‌ను 12వ ఆటగాడిగా వసీం జాఫర్ ఎంపిక చేశాడు. వసీం జాఫర్ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే.. ఎంఎస్ ధోని (సారథి, వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, వసీం ఆక్రమ్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్, సక్లాయిన్ ముస్తాక్/షేన్ వార్న్, రికీ పాంటింగ్(12వ ఆటగాడు) చదవండి: ప్రపంచకప్ ఫైనల్ క్రెడిట్ ఎవరికి?.. రైనా క్లారిటీ! ఆ క్షణం ఇంకా రాలేదు -
బిషప్ జట్టులో సచిన్, రోహిత్
ప్రపంచకప్ నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్ జట్టును ప్రకటించాడు. టీమిండియా అభిమానులకు అమితానందం కలిగించేలా నలుగురు భారత ఆటగాళ్లకు తన జట్టులో చోటు కల్పించాడు. ఓపెనర్లుగా మనవారినే ఎంపిక చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జోడిగా రోహిత్ శర్మను ఓపెనర్‌గా జట్టులో చేర్చాడు. సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లాంటి హేమాహేమీలను వదిలేసి రోహిత్‌వైపు మొగ్గు చూపడం విశేషం. విండీస్ పొడగరి ఫాస్ట్ బౌలర్ వీవీ రిచర్డ్స్‌ను మూడో నంబర్ బ్యాట్స్‌మన్‌గా తీసుకున్నాడు. కీలకమైన నాలుగో స్థానానికి టీమీండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు ఐదో స్థానం ఇచ్చాడు. మరోమాటకు తావులేకుండా డివిలియర్స్‌ను ఎంపిక చేసినట్టు బిషప్ వెల్లడించాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడి 50 ప్లస్ సగటు నమోదు చేసిన ఏకైక ఆటగాడు ఏబీ మాత్రమేనని గుర్తుచేశాడు. ఆరో స్థానానికి కపిల్‌దేవ్, ఇయాన్ బోథమ్, జాక్వెలిస్ కల్లిస్, ఇమ్రాన్ ఖాన్ లాంటి ఉద్దండులను కాదని లాన్స్ క్లుసెనర్ వైపు బిషప్ మొగ్గుచూపాడు. అత్యుత్తమ ఫినిషర్ ఎంఎస్ ధోనిని వికెట్ కీపర్‌గా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఒక్కరికి మాత్రమే చోటు కల్పించి ఆశ్చర్యపరిచాడు. బిషప్ ఆల్‌టైమ్ వన్డే జట్టు సచిన్ టెండ్కూలర్, రోహిత్ శర్మ, వీవీ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, లాన్స్ క్లుసెనర్, ఎంఎస్ ధోని, వాసిం అక్రం, సక్లెయిన్ ముస్తాక్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్ -
సచిన్ ను తీసేయడానికి సిద్ధమయ్యాం!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ సేవలందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పడానికి ముందే అతని ఉద్వాసనకు రంగం సిద్ధమైందట. 2012లో భారత వన్డే జట్టు నుంచి సచిన్‌ను తొలగించడానికి సిద్ధమైనట్లు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. ఓ మరాఠీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ తొలగింపుపై సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' 2012, డిసెంబర్ 12 వ తేదీన సచిన్ భవిష్యత్తు కార్యచరణపై అడిగాం. అయితే రిటైర్మెంట్ ఆలోచన లేదని సచిన్ చెప్పాడు.ఆ సమయంలో సచిన్ నిర్ణయాన్ని గౌరవించిన సెలక్షన్ కమిటీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఆ తరువాత జరిగిన మరో సమావేశంలో సచిన్ తన రిటైర్మెంట్పై నిర్ణయాన్నిమాకు తెలిపాడు. అప్పుడు సచిన్ కనుక రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోనట్లయితే, అతన్ని కచ్చితంగా వన్డే జట్టు నుంచి తొలగించే వాళ్లం'అని పాటిల్ పేర్కొన్నాడు. తన నాలుగేళ్ల పదవీ కాలంలో అతి పెద్ద సవాల్ ఎదైనా ఉందంటే అది సచిన్ రిటైర్మెంట్ నిర్ణయమేనని సందీప్ పాటిల్ తెలిపాడు. 2013 నవంబర్ నెలలో వెస్టిండీస్‌తో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే 2012 మార్చిలో ఢాకాలో పాకిస్తాన్‌తో సచిన్ చివరి వన్డే ఆడేశాడు. -
పుజారా బౌలింగ్ ప్రయత్నాలు!
వన్డేల్లో స్థానం కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న బ్యాట్స్‌మన్ న్యూఢిల్లీ: చతేశ్వర్ పుజారా అంటే చక్కటి బ్యాట్స్‌మన్‌గానే గుర్తింపు ఉంది. ఇకపై అతనిలో బౌలర్‌ను కూడా చూస్తామేమో! కేవలం బ్యాటింగ్‌తో వన్డే జట్టులో స్థానం దక్కడం అసాధ్యమని అనుకున్నాడేమో, బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టాడు. ఇటీవల ఆసియా కప్‌లో భారత జట్టుతో పాటు ఉన్నా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. తాజాగా పుజారా నెట్స్‌లో లెగ్‌స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో చతేశ్వర్ 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ‘నెట్స్‌లో బౌలింగ్ కూడా చేస్తున్నా. పార్ట్ టైమ్ బౌలర్‌గా నా వంతు పాత్ర పోషించగలను. కెప్టెన్ అవకాశం ఇస్తే బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడగలని నా నమ్మకం’ అని పుజారా వ్యాఖ్యానించాడు. రాబోయే ఐపీఎల్లో సత్తా చాటితే తనకు వన్డే జట్టులోనూ రెగ్యులర్‌గా స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నేను గతంలో కొన్ని చక్కటి టి20 ఇన్నింగ్స్ ఆడాను. ఈ ఫార్మాట్లోనూ రాణించగల సామర్థ్యం నాకుంది. భారీ షాట్లు ఆడటం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని పుజారా వెల్లడించాడు. ఐపీఎల్-7లో పుజారా కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడనున్నాడు.