సచిన్, రోహిత్, బిషప్
ప్రపంచకప్ నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్ జట్టును ప్రకటించాడు. టీమిండియా అభిమానులకు అమితానందం కలిగించేలా నలుగురు భారత ఆటగాళ్లకు తన జట్టులో చోటు కల్పించాడు. ఓపెనర్లుగా మనవారినే ఎంపిక చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జోడిగా రోహిత్ శర్మను ఓపెనర్‌గా జట్టులో చేర్చాడు. సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లాంటి హేమాహేమీలను వదిలేసి రోహిత్‌వైపు మొగ్గు చూపడం విశేషం.
విండీస్ పొడగరి ఫాస్ట్ బౌలర్ వీవీ రిచర్డ్స్‌ను మూడో నంబర్ బ్యాట్స్‌మన్‌గా తీసుకున్నాడు. కీలకమైన నాలుగో స్థానానికి టీమీండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు ఐదో స్థానం ఇచ్చాడు. మరోమాటకు తావులేకుండా డివిలియర్స్‌ను ఎంపిక చేసినట్టు బిషప్ వెల్లడించాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడి 50 ప్లస్ సగటు నమోదు చేసిన ఏకైక ఆటగాడు ఏబీ మాత్రమేనని గుర్తుచేశాడు. ఆరో స్థానానికి కపిల్‌దేవ్, ఇయాన్ బోథమ్, జాక్వెలిస్ కల్లిస్, ఇమ్రాన్ ఖాన్ లాంటి ఉద్దండులను కాదని లాన్స్ క్లుసెనర్ వైపు బిషప్ మొగ్గుచూపాడు. అత్యుత్తమ ఫినిషర్ ఎంఎస్ ధోనిని వికెట్ కీపర్‌గా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఒక్కరికి మాత్రమే చోటు కల్పించి ఆశ్చర్యపరిచాడు.
బిషప్ ఆల్‌టైమ్ వన్డే జట్టు
సచిన్ టెండ్కూలర్, రోహిత్ శర్మ, వీవీ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, లాన్స్ క్లుసెనర్, ఎంఎస్ ధోని, వాసిం అక్రం, సక్లెయిన్ ముస్తాక్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్
Comments
Please login to add a commentAdd a comment