వన్డేల్లో స్థానం కోసం నెట్స్‌లో
శ్రమిస్తున్న బ్యాట్స్‌మన్
న్యూఢిల్లీ: చతేశ్వర్ పుజారా అంటే చక్కటి బ్యాట్స్‌మన్‌గానే గుర్తింపు ఉంది. ఇకపై అతనిలో బౌలర్‌ను కూడా చూస్తామేమో! కేవలం బ్యాటింగ్‌తో వన్డే జట్టులో స్థానం దక్కడం అసాధ్యమని అనుకున్నాడేమో, బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టాడు. ఇటీవల ఆసియా కప్‌లో భారత జట్టుతో పాటు ఉన్నా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. తాజాగా పుజారా నెట్స్‌లో లెగ్‌స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో చతేశ్వర్ 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
‘నెట్స్‌లో బౌలింగ్ కూడా చేస్తున్నా. పార్ట్ టైమ్ బౌలర్‌గా నా వంతు పాత్ర పోషించగలను. కెప్టెన్ అవకాశం ఇస్తే బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడగలని నా నమ్మకం’ అని పుజారా వ్యాఖ్యానించాడు. రాబోయే ఐపీఎల్‌లో సత్తా చాటితే తనకు వన్డే జట్టులోనూ రెగ్యులర్‌గా స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నేను గతంలో కొన్ని చక్కటి టి20 ఇన్నింగ్స్ ఆడాను. ఈ ఫార్మాట్‌లోనూ రాణించగల సామర్థ్యం నాకుంది. భారీ షాట్లు ఆడటం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని పుజారా వెల్లడించాడు. ఐపీఎల్-7లో పుజారా కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడనున్నాడు.
పుజారా బౌలింగ్ ప్రయత్నాలు!
Published Wed, Mar 12 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement
Advertisement