వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దురదృష్టకరరీతిలో ఔటయ్యాడు. అతడు ఔటైన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడి ఔట్‌పై వివాదం చెలరేగింది.
అసలేం జరిగిందంటే?
312 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాలో పడింది. ఈ సమయంలో స్మిత్, లాబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో మూడో, నాలుగో బంతులను స్మిత్ బౌండరీలగా మలిచాడు. ఆ తర్వాతి బంతిని కూడా లెగ్ సైడ్ ఆడటానికి స్మిత్ ప్రయత్నించాడు.
కానీ బంతి మిస్ అయ్యి స్మిత్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ విల్సన్ నో అంటూ తలఊపాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో తొలుత బంతి ఈజీగా లెగ్‌స్టంప్ మిస్‌అవుతున్నట్లు కన్పించింది. కానీ బాల్ ట్రాకింగ్‌లో మాత్రం బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు తేలింది.
దీంతో థర్డ్ అంపైర్ స్మిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్‌అంపైర్ తీసుకున్న నిర్ణయం బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు ఫీల్డ్ అంపైర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కనీసం అంపైర్ కాల్ అయినా వస్తుందని భావించారు.
కానీ అందరి అంచనాలను 'హాక్ ఐ' టెక్నాలజీ తారుమారు చేసింది. కాగా గత కొంతకాలంగా ఎల్బీ డబ్ల్యూ రివ్యూ, క్యాచ్‌ల ఫలితాల తేల్చడంలో 'హాక్ ఐ' టెక్నాలజీని ఐసీసీ వాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. టెక్నాలజీ లోపానికి స్మిత్ బలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ICC World Cup 2023 SA vs AUS: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా?
Comments
Please login to add a commentAdd a comment