
గాల్లో క్యాచ్ అందుకుంటున్న మార్క్‌రమ్
జొహన్నెస్‌బర్గ్ : వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డేలో ప్రొటీస్ కెప్టెన్ మార్క్‌రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో వావ్ అనిపించాడు. రబడా వేసిన 46 ఓవర్ చివరి బంతిని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ కొట్టాడు. అదే దిశలో ఆఫ్‌సైడ్ సర్కిల్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్‌రమ్ అంతే వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో పాండ్యా పెవిలియన్ చేరాడు.
అయితే ఈ అద్భుత క్యాచ్‌కు సఫారీ ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏ మాత్రం సాధ్యం కాని క్యాచ్‌ను మార్క్‌రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment