
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. గత ఏడాది మార్చిలో తొలిసారి దక్షిణాఫ్రికా టి20 జట్టుకు కెపె్టన్‌గా ఎంపికైన మార్క్‌రమ్ సారథ్యంలోనే సఫారీ బృందం ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది.
వికెట్ కీపర్ రికెల్టన్, పేసర్ బార్ట్‌మన్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. డికాక్, కొయెట్జీ, ఫోరŠూట్యన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, నోర్జే, రబడ, షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు.