టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక ఈ సిరీస్ కోసం టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు గురువారం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీ వేదికగా జూన్ 9న తొలి టీ20 జరగనుంది.
ఇక ఇరు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో స్వదేశంలో జరగనున్న టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.
అయితే ప్రోటీస్ జట్టును ఓడించడం అంత సులభం కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు టీమిండియాకు దూరం కాగా... ప్రోటీస్ మాత్రం తమ బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ఐపీఎల్‌లో ఆడిన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి భారత్‌కు వీరి నుంచి గట్టి పోటి ఎదురుకానుంది.
ఈ ముగ్గురు ఆటగాళ్ల పట్ల టీమిండియా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఈ ఏడాది సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన డికాక్ దుమ్మురేపాడు. 15 మ్యాచ్ లు ఆడిన డికాక్ 508 పరుగులు చేశాడు. ఇందులో ఒక భారీ సెంచరీ కూడా ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డికాక్ 140 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ఇక డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు అద్భుమైన ఫినిషర్‌గా మిల్లర్ మారాడు. 16 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 481 పరుగులు సాధించాడు. అదే విధంగా పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడ.. 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక వీరితో పాటు ఐడెన్ మారక్రమ్, ఫాస్ట్ బౌలర్ జానేసన్ పర్వాలేదనిపించారు.
టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
దక్షిణాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.
చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment