
PC: BCCI
స్వదేశంలో టీమిండియా 5 టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనుంది. ఇప్పటికే ప్రోటిస్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
దీంతో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. ఇక తొలి టీ20 కోసం జూన్ 5 న ఢిల్లీలో సమావేశమవ్వాలని భారత ఆటగాళ్లని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు జూన్2న ఢిల్లీకి చేరుకోనుంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. .. హార్ధిక్, డీకే రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment