File Photo
దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా గరువారం జరగనుంది. అయితే తొలి టీ20కు ముందు భారత్‌ను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. టీమిండియా తన చివరి 12 టీ20 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించింది. ప్రోటీస్‌తో జరగనున్న తొలి వన్డేలో భారత్ గెలుపొందితే.. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు(13) సాధించిన జట్టుగా రికార్డులకెక్కుతుంది.
ఇప్పటికే ఆఫ్గానిస్తాన్, రోమానియా జట్లు వరుసగా 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి భారత్‌తో సమానంగా నిలిచాయి. ఇక తొలి టీ20కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను బీసీసీఐ నియమించింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
చదవండి: Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా!
Comments
Please login to add a commentAdd a comment