వాషింగ్టన్: అమెరికా అధ‍్యక్షుడు జో బైడన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కొవిడ్ నుంచి బైడెన్ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించిన మూడురోజుల్లోనే.. మళ్లీ ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో మరోమారు ఆయన ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆయనకు స‍్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ తెలిపారు.
‘79 ఏళ్ల బైడెన్‌కు గత శనివారం నిర్వహించిన ఆంటిజెన్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వరుసగా నాలుగు రోజులు నెగెటివ్‌గా తేలిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మళ్లీ ఐసోలేషన్ నిబంధనలు పాటిస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.’ అని పేర్కొన్నారు డాక్టర్ కెవిన్ ఓ కానర్.
An update from Dr. Kevin O’Connor, Physician to the President. pic.twitter.com/40oqYOYTQN
— The White House (@WhiteHouse) July 30, 2022
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్షునికి కరోనా
Comments
Please login to add a commentAdd a comment