ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్ తేలింది. ప్రస్తుతం రోహిత్ జట్టు హోటల్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. "శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.
కాగా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం లీసెస్టర్ షైర్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచులో మాత్రం శర్మ పాల్గొంటున్నాడు. అయితే ఈ మ్యాచ్ అఖరి రోజు ఆటకి రోహిత్ దూరం కానున్నాడు. ఇక రోహిత్ వారం రోజులు పాటు ఐషోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై1న జరగబోయే నిర్ణయాత్మక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్
UPDATE - #TeamIndia Captain Mr Rohit Sharma has tested positive for COVID-19 following a Rapid Antigen Test (RAT) conducted on Saturday. He is currently in isolation at the team hotel and is under the care of the BCCI Medical Team.
— BCCI (@BCCI) June 25, 2022
Comments
Please login to add a commentAdd a comment