England Vs India: Rohit Sharma Recovered From COVID-19 - Sakshi
Sakshi News home page

ENG vs IND: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!

Published Sun, Jul 3 2022 2:15 PM | Last Updated on Sun, Jul 3 2022 9:09 PM

Great news for India, Rohit Sharmas 2nd TEST also negative - Sakshi

PC: IN Side sport

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ముందు కరోనా బారిన పడిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో రోహిత్‌ శర్మకు నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20,వన్డే సిరీస్‌లకు రోహిత్‌ అందుబాటులో ఉండనున్నాడు.

ఇక జూలై 7న ఎడ్జ్‌బస్టన్‌ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఐదో టెస్టులో పాల్గొన్న సీనియర్‌ ఆటగాళ్లకు తొలి టీ20కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.

తొలి20కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్

వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ చాహల్, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్‌ సింగ్‌
చదవండి:
 IRE vs NZ: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement