కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌: తెలంగాణ హైకోర్టు | Telangana High Court Asks State Government To Increase Covid Tests | Sakshi
Sakshi News home page

కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. టెస్టులు పెంచండి: తెలంగాణ హైకోర్టు

Jun 8 2022 9:33 PM | Updated on Jun 9 2022 3:31 PM

Telangana High Court Asks State Government To Increase Covid Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టెస్టులు కూడా పెంచాలంటూ ఆదేశించింది.

కరోనా కేసులపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా..  కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అనంతరం విచారణను ఈ నెల 22కి హైకోర్టు వాయిదా వేసింది. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు గణనీయంగా పెరిగాయి.

రాష్ట్రంలో మంగళవారం 13,149 నమూనాలను పరీక్షించగా 119 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65 మాత్రమే. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనూ కరోనా కేసులు పెరుగు ముఖం పడుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement