పచ్చగా ఉంటే ఓర్వరా..!! | Vivek Dahiya Lashed Out Comments Not Displaying Enough Love At Divyanka | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 3:58 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Vivek Dahiya Lashed Out Comments Not Displaying Enough Love At Divyanka - Sakshi

భర్త వివేక్‌తో దివ్యాంక, ఖయామత్‌ హీరోయిన్‌ కరిష్మా తన్నా

సాక్షి, ముంబై: ఖయామత్‌ కి రాత్‌ సీరియల్‌లో నటిస్తున్నప్పటి నుంచి వివేక్‌ దహియాకు భార్యపై ప్రేమ తగ్గిపోయిందా..? అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేస్తుండడం పట్ల ఆయన స్పందించారు. పచ్చగా కలిసుండే జంటను చూస్తే కొందరు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖయామత్‌ కి రాత్‌ సీరియల్‌లో వివేక్‌.. కరిష్మా తన్నాతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీరియల్‌ షూటింగ్‌ ప్రారంభమైన నాటి నుంచి వివేక్‌, అతని భార్య దివ్యాంక త్రిపాఠిల మధ్య ప్రేమ పలుచనైందనీ సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

కరిష్మా, వివేక్‌ల మధ్య ఏదో నడుస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృత్తిలో భాగంగా కాస్త దగ్గరగా ఉంటే చాలు.. లేని పోనివి అంటగట్టాలని చూస్తారని వివేక్‌ నెటిజన్లపై మండిపడ్డారు. ‘ఖయామత్‌ కి రాత్‌’ షోలో వివేక్‌, కరిష్మా జోడీ హాట్‌గా కనిపించబోతోందని తన భార్య దివ్యాంక కితాబిచ్చింద’ని వివేక్‌ సంబరపడ్డారు. ‘ఇది చాలదా..! అందరి నోళ్లు మూయించడానికి’ అని చురకలంటించారు. సీరియల్‌ విశేషాలు చెప్తూ.. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోందనీ, దాదాపు 100 ఎపిసోడ్లకు పైగా సీరియల్‌ కొనసాగనుందని తెలిపారు. కాగా, ఖయామత్‌ కి రాత్‌ షో స్టార్‌ ప్లస్‌లో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement