నెటిజన్స్‌పై ఫైర్‌ అయిన సమంత! | Samantha Fires On Netizens Over Her Dressing | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 1:01 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Samantha Fires On Netizens Over Her Dressing - Sakshi

సోషల్‌మీడియాలో అడ్డూ అదుపూ లేకుండా కామెంట్లు పెడుతున్న నెటిజన్లకు సమంత ఘాటుగా రిప్లై ఇచ్చారు. తను వేసుకున్న డ్రెస్‌పై సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తను ఎలా ఉండాలో ఉచిత సలహాలిస్తున్న వారికి కాస్త గట్టిగానే బదులిచ్చారు సమంత. 

అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చాక ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవడం ఏంటి?.. డ్రెస్‌ బాగోలేదు.. వెంటనే ఫోటోను తీసేయ్‌.. అంటూ ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్‌ చేశారు. అయితే దీనిపై స్పందించిన సమంత.. ‘నేను పెళ్లి అయిన తరువాత ఎలా ఉండాలో చెబుతున్న వారందరికే ఇదే నా సమాధానం’ అంటూ.. మధ్య వేలు చూపిస్తూ ఉన్న ఫోటోను పోస్ట్‌చేశారు. దీనిపైనా కొంతమంది నెటిజన్లు మండిపడగా, మరికొంత మంది సపోర్ట్‌ చేశారు. ఇక ఇంతటితోనైనా ఈ అంశానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి. 

చదవండి : సమంత డ్రెస్సింగ్‌పై మళ్లీ రచ్చ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement