దక్షిణాది వారికి సినిమా పిచ్చి కన్నా హీరోల మీద భక్తే ఎక్కువగా ఉంటుంది. మెగా స్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, యంగ్ టైగర్.. ఇలా రకరకాల పేర్లతో తమ అభిమాన హీరోలను ఆరాధిస్తారు. కానీ ఒకరి ట్యాగ్ మరొకరికి వాడితే మాత్రం అస్సలు సహించరు సరికదా సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరిగింది. (చదవండి: ఫైనల్ విన్నాక ఫైనలైజ్!)
తెలుగు ఓటీటీ 'ఆహా'లో సామ్ జామ్ ప్రోగ్రామ్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి సామ్‌తో కలిసి సందడి చేయగా తాజాగా అల్లు అర్జున్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన ఆహా పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 21న వీక్షించవచ్చని తెలిపింది. అయితే ప్రోమోలో అల్లు అర్జున్‌కు ముందు "మెగాస్టార్" అని రాసుకొచ్చారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్ 'ఆహా'పై తీవ్రంగా మండిపడుతున్నారు. మా చిరంజీవి బిరుదును అందుకునే అర్హత ఏ హీరోకు లేదని ఫైర్ అవుతున్నారు.
అయినా స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ ఉండగా అల్లు అర్జున్‌ను మెగాస్టార్ అని పిలవడమేంటని నిందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకైక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని తేల్చి చెప్తున్నారు. ఎంత సొంత ఓటీటీ అయితే మాత్రం బన్నీకి మెగాస్టార్ అన్న ట్యాగ్ ఇచ్చేస్తారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వెంటనే ఆహా మెగాస్టార్ ట్యాగ్‌ను తీసి, స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ యాడ్ చేసి తన తప్పు సరిదిద్దుకుంది. అయితే అంతకు ముందు ఎపిసోడ్‌లో చిరంజీవి పాల్గొన్నందున మెగాస్టార్ అనే ట్యాగ్‌ను తీసేయడం టెక్నికల్ టీమ్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అంతే తప్ప కావాలని మరీ ఇంత పెద్ద తప్పు చేసుండకపోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ)
Comments
Please login to add a commentAdd a comment