సమంత డ్రెస్సింగ్‌పై మళ్లీ రచ్చ! | Samantha Akkineni Trolled By Netizens On Her Dress In Instagram | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 27 2018 5:36 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Samantha Akkineni Trolled By Netizens On Her Dress In Instagram - Sakshi

సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు తన అభిమానులకు సరదాగా రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు సరద సరదాగా ట్వీట్లు చేసినంత వరకు బాగానే ఉంటుంది కానీ.. అభిమానులకు నచ్చని పనులు చేస్తేనే వస్తుంది తంటా.

ప్రస్తుతం సమంత షేర్‌ చేసిన ఫోటో అభిమానులకు కాస్త ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. గతంలోకూడా సమంత డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెడ్‌ కలర్‌లో ఉన్న పొట్టి దుస్తులను వేసుకొని దిగిన ఫోటోను షేర్‌చేయడంతో సమంతపై ట్రోలింగ్‌ మొదలైంది. 

ఈ విషయంలో సమంత అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరు సమంతకు సపోర్ట్‌గా కామెంట్‌లు పెట్టగా, మరికొందరు నెగెటివ్‌గా కామెంట్‌ చేస్తున్నారు. కొందరు లేడీ ఫ్యాన్స్‌ సైతం సమంత వేసుకున్న డ్రెస్‌ బాగోలేదంటూ, తన నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరు సమంతకు సపోర్ట్‌గా.. ఏ డ్రెస్‌ వేసుకోవాలో చెప్పే అధికారం ఎవరకి లేదంటూ.. ఇలా నెగెటివ్‌గా ఆలోచించే వారు ప్రతిచోటా ఉంటారు. ఇలాంటివారిని పట్టించుకోవద్దు.. ప్రపంచం ముందుకు పోతూ ఉంటే.. ఇంకా కొందరు ఎక్కడో ఉన్నారంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారిపై ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొంతమంది.. నీవు ప్రస్తుతం సమంత మాత్రమే కాదనీ, ఎంతో మంచి చరిత్ర ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లావని, వెంటనే ఆ ఫోటోను తీసేయ్‌, ఇలాంటి పనులు చేయడం నచ్చలేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి సమంత చేసిన ఈ ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Inner peace 😎

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement