ఆ షోలో నేను నటించట్లేదు: నటి | I Am Not Acting in That Serial: Actress Vibhoutee Sharma | Sakshi
Sakshi News home page

ఆ షోలో నేను నటించట్లేదు: నటి

Published Thu, Jul 4 2019 5:22 PM | Last Updated on Thu, Jul 4 2019 5:23 PM

I Am Not Acting in That Serial: Actress Vibhoutee Sharma - Sakshi

సోనీ టీవీలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్‌ ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా’ లో లీడ్‌ క్యారక్టర్‌ ‘డయాబెన్‌’గా తాను నటించబోతున్నట్టు వచ్చిన వార్తలు వట్టి రూమరని నటి విభూతి శర్మ కొట్టిపారేసింది. ఆ సీరియల్‌ను తాను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని స్పష్టం చేసింది. డయాబెన్‌ పాత్రను ఇంతకు ముందు నటి దిశా వకాని పోషించింది. ఆమె గత ఏడాదిన్నరగా మెటర్నిటీ లీవ్‌లో ఉంది. లీవ్‌ అయిపోయిన తర్వాత నిర్మాతకు ఆమె కొన్ని కండిషన్స్‌ పెట్టిందనీ, వాటికి నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఆమె స్థానంలో విభూతి శర్మను తీసుకున్నట్టుగా ఒక వార్త మీడియాలో షికారు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. తనకు  సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ఒకవేళ నటించాల్సి వస్తే నా వయసు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటానని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement