
ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్లు ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలుగా తిరిగొస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య,బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌తో సందడి చేశారు. టోపాజ్ బ్లూ కలర్‌లో ఉన్న చేతక్ బండితో ఫోజులిచ్చారు. ప్రస‍్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తుండగా..నెటిజన్లు కిరణ్ రావు కొనుగోలు చేసిన బజాజ్ చేతక్ లుక్స్ క్యూట్‌గా ఉందని అంటున్నారు. అంతేకాదు బిల్డ్ క్వాలిటీ, రైడ్ ఎబిలిటీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
బజాజ్ చేతక్ బైక్ ఫీచర్స్
3.8కేడబ్ల్యూ పీఎంఎస్ మోటర్, 5బీపీహెచ్,16.2 ఎన్‌ఎం టారిక్‌తో అందుబాటులోకి ఉంది. లిథియం అయాన్ బ్యాటరీతో బిల్డ్ చేసిన బజాజ్ చేతక్ బైక్‌కు త్రీ పిన్ చార్జర్ సాకెట్‌తో ఛార్జింగ్ పెడితే 6 నుంచి 7గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక అదే బ్యాటరీని సింగిల్ ఛార్జ్ చేస్తే 80కిలోమీటర్లు, ఈకో మోడ్‌లో 95 కిలోమీటర్ల వరకు, టాప్ స్పీడ్ 70కిలో మీటర్ల వరకు డ్రైవ్ చేయొచ్చు. మెటల్ బాడీ, ఎల్‌ఈడీ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు మరికొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
బజాజ్ చేతక్ ధరెంత?
బజాజ్ చేతక్ ధర అర్బన్ వేరియంట్‌కు రూ.1.42 లక్షలు, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.44 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అయితే ఈ మోడల్ ధర ఓలా ఎస్ 1,అథర్ 450 ఎక్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!
Comments
Please login to add a commentAdd a comment