బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ మాజీ జంట తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి బయటికి లంచ్‌కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు ఆజాద్ (9) ఉన్నాడు. ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆదివారం (సెప్టెంబర్ 26న) అందరూ కలిసి లంచ్‌కి బయటికి వచ్చారు. భారీ భద్రత మధ్య వచ్చిన వారు భోజన అనంతరం ఓపికగా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చారు.
అయితే వీడిపోయిన తర్వాత కూడా అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’కి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అంతేకాకుండా కుమారుడి సంబంధించిన అన్ని విషయాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లడ్డాఖ్‌లో జరుగుతున్న సమయంలో ఈ మాజీ జంట అక్కడి స్థానికులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment