
Aamir Khan-Kiran Rao Divorce: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్-కిరణ్ రావు దంపుతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కొత్త జీవితం కోసం విడుపోతున్నామని, అయిన తాము కుటుంబంగా కలిసే ఉంటామమని వారిద్దరూ సంయుక్తంగా విడాకుల ప్రకటన చేశారు. దీంతో వారి తీరు చూసి నెటిజన్లు మండిపడ్డారు. అనంతరం అమీర్ ఖాన్, కిరణ్ రావులను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం అమీర్, కిరణ్ రావులకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో సంతోషంగా చేతిలో చేయ్యి వేసుకుని తాము విడిపోవాలనుకున్నామని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ వీఇయో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమీర్ మాట్లాడుతూ కిరణ్ చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు. భార్య భర్తలుగా విడిపోయిన మేము ఒకరి ఒకరం తోడుగా ఉంటామని, తాము ఒకే కుటుంబమని వ్యాఖ్యానించాడు. ‘మా విడాకులు ప్రకటన విని మీరంత షాక్ అయ్యుండొచ్చు. ఈ వార్త మీమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు. కానీ మా నిర్ణయంతో మేమీద్దరం చాలా సంతోషంగా ఉన్నామని మీకు చెప్పాలనుకుంటున్నాము.
విడాకులు తీసుకున్న మేము ఒకే కటుంబంగా ఉంటాం. దీనివల్ల మా సంబంధంలో మార్పు వచ్చింది కానీ ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం’ అంటూ అమీర్ మాట్లాడుకొచ్చాడు. ఇది చూసి కొంతమంది వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరూ తమదైన శైలిలో సటైరికల్‌గా స్పందిస్తున్నారు. కాగా లగాన్ మూవీ సమయంలో కిరణ్‌తో ప్రేమలో పడిన అమీర్ 2005లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతకు ముందు రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్ తమ 16 ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పి కిరణ్‌ను వివాహమాడాడు.