Aamir Khan Kiran Rao Attends Together at Karan Johar Birthday Party - Sakshi
Sakshi News home page

Aamir Khan- Kiran Rao: విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్‌ కపుల్‌

Published Thu, May 26 2022 12:50 PM | Last Updated on Thu, May 26 2022 1:34 PM

Aamir Khan, His Ex Wife Kiran Rao Attends Karan Johar Birthday Party - Sakshi

విడాకుల తర్వాత మరోసారి కలిసి దర్శనమిచ్చారు ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌రావు. ఆ మధ్య తమ కుమారుడు ఆజాద్‌ రావు ఖాన్‌ బర్త్‌డేను కలిసి సెలబ్రేట్‌ చేసిన ఈ మాజీ దంపతులు తాజాగా నిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీలో కలిసి దర్శనమిచ్చారు. ఆమిర్‌ బ్లూ డ్రెస్‌లో రాయల్‌ లుక్‌లో కనిపిస్తే కిరణ్‌ రావు సిల్వర్‌ డ్రెస్సులో ధగధగ మెరిసిపోయింది. రెడ్‌ కార్పెట్‌పై కలిసి నిలబడ్డ ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం గమనార్హం. ఇది చూసిన ఓ అభిమాని అదేంటి? వీళ్లు విడాకులు తీసుకోలేదా? అని ప్రశ్నించాడు.

దీనికి ఇతర ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. 'మీరింకా ఎదగాలి బాబూ.. వాళ్లు విడాకులు తీసుకున్నమాట వాస్తవమే. అంతమాత్రానికి ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? శత్రువులుగా మిగిలిపోవాలా? కాస్త బుద్ధిపెట్టి ఆలోచించండి', 'విడాకులు తీసుకున్నాక కూడా ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. పైగా పిల్లలు ఉన్నప్పుడు వారు స్నేహంగా మెదలడం అత్యవసరం. విడిపోయిన అందరూ బద్ధ శత్రువులు అవుతారనుకోవద్దు' అని సమాధానమిచ్చారు. కాగా గతేడాది ఆమిర్‌, కిరణ్‌ విడాకులు తీసుకున్నారు. ఆమిర్‌ సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన లాల్‌ సింగ్‌ చద్దా ఆగస్టు 11న రిలీజ్‌ కానుంది.

చదవండి: కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ ఎంగేజ్‌మెంట్‌
టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ నిర్మాత కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement