
మాజీ భార్య రీనా దత్తాతో ఆమిర్ ఖన్
16 ఏళ్ల వైవాహిక బంధానికి తెరపడినప్పటికీ, తన మాజీ భార్య రీనా దత్తాతో ఇప్పటికీ స్నేహబంధం కొనసాగుతూనే ఉందన్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఇటీవల.. కరణ్ జోహార్ చాట్ షోలో పాల్గొన్న ఆమిర్ మాట్లాడుతూ.. రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించాడు.
‘రీనాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన ఆమెపై నాకు గౌరవం లేనట్లు కాదు. విడిపోయిన సమయంలో మా ఇద్దరితో పాటు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధ పడ్డారు. కానీ అభిప్రాయ భేదాలు వచ్చాక కలిసి ఉండటంలో అర్థం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే మాకు పెళ్లి అయింది బహుశా ఈ కారణం వల్లే అలా జరిగిపోయి ఉంటుంది’ అంటూ ఆమిర్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలుగా విడిపోయామే కానీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉంటామని, సామాజిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటామని పేర్కొన్నాడు. కాగా 2002లో రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్.. మూడేళ్ల అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment