
గంటకు రెండు కోట్లు!
బాలీవుడ్ పాపులర్ కపుల్స్ వాణిజ్య ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమే. ఇప్పటిదాకా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్, సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్‌లు బుల్లితెర మీద ప్రకటనలతో సందడి చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావ్ చేరుతున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రకటనలో నటించడానికి వారు కేటాయించింది గంటసేపే! ఆ గంటకు వారు ఎంత మొత్తం తీసుకుంటున్నారో తెలుసా..? అక్షరాలా రెండు కోట్లు! మరి క్రేజీ కపులా... మజాకానా..!