పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా? విలక్షణ నటుడు జగపతిబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! మరింకెవరునుకుంటున్నారా? బాలీవుడ్ బడా హీరో ఆమిర్ ఖాన్. తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఆమిర్ హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు చేపట్టాడు. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈ పూజ పూర్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమిర్ నుదుటన బొట్టుతో, చేతికి కంకణంతో, అదే చేత్తో కలశం పట్టుకుని కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
'హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్లు సడన్‌గా నాటకం మొదలుపెట్టాడేంటి?', 'నీ సినిమాలు ఫ్లాప్, నువ్వూ ఫ్లాప్.. మళ్లీ కొత్తగా ఇదేంటో', 'ఇండస్ట్రీ నిన్ను బయటకు గెంటేయకుండా ఉండేందుకు ఇలా ప్లాన్ చేశావన్నమాట' అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఆమిర్, కిరణ్.. మీ ఇద్దరినీ మేమెల్లప్పుడూ గౌరవిస్తాం' అని మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఆమిర్-కిరణ్‌లు గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇకపోతే ఆమిర్ నటించిన లాల్‌సింగ్ చడ్డా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన ఆయన ఏడాది తర్వాతే సినిమాల్లో నటించనున్నాడు.
Guess the man in the pic.. pic.twitter.com/z0QugsVLYx
— 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) December 8, 2022
చదవండి: బ్రేకప్‌దాకా వెళ్లాను, ఎవరికీ కనిపించకుండా పోదామనుకున్నా: సిరి
నన్నెవరూ బ్యాన్ చేయలేదు: రష్మిక మందన్నా
Comments
Please login to add a commentAdd a comment