బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి లాపాటా లేడీస్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ధోబీ ఘాట్ తర్వాత మరోసారి అమిర్ ఖాన్ తన మాజీ భార్యతో జతకట్టడంపై బాలీవుడ్‌లో తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!)
కాగా.. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లపాటా లేడీస్ అనే చిత్రాన్ని ఇద్దరు నవ వధువుల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2001లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. కిరణ్ రావు, అమిర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వీరి బంధానికి 2021లో ముగింపు పలికారు.
(ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment