నాకు చాలాసార్లు అబార్షన్‌ అయింది: స్టార్‌ హీరో మాజీ భార్య | Kiran Rao Says She Had Lot of Miscarriages for 5 Years Before Welcoming son Azad | Sakshi
Sakshi News home page

Kiran Rao: చాలాసార్లు కడుపులోనే బిడ్డను కోల్పోయిన అమీర్‌ ఖాన్‌ మాజీ భార్య

Published Fri, Apr 19 2024 5:02 PM | Last Updated on Fri, Apr 19 2024 5:39 PM

Kiran Rao Says She Had Lot of Miscarriages for 5 Years Before Welcoming son Azad - Sakshi

దర్శకనిర్మాత కిరణ్‌రావు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌కు మాజీ భార్య. 2005లో ఆమిర్‌.. కిరణ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్‌- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్‌ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్‌ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు.

అప్పుడే ఆజాద్‌..
తాజాగా కిరణ్‌ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్‌ సినిమా (2011) సమయంలో ఆజాద్‌ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్‌ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది.

పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం
బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్‌- సరోగసి ద్వారా ఆజాద్‌ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్‌కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్‌ రావు ఇటీవలే లాపతా లేడీస్‌ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది.

చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్‌? జబర్దస్త్‌ కమెడియన్‌ ఏమన్నాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement