
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలంటూ ఆలియా భట్(Alia Bhatt)కు కాల్ వచ్చింది. ఈ ఏడాది మే 13 నుంచి మే 24 వరకు ఫ్రాన్స్‌లో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాలకు ఆలియా భట్ హాజరు కానున్నారు. ఈ బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక తాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొననున్న విషయాన్ని ఆలియా భట్ ధృవీకరించారు. ఈ నెల 15న ఆమె బర్త్ డే సందర్భంగా ముంబైలో గురువారం జరిగిన ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయమని నా సిబ్బందికి చెప్పాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment