Oscar Awards 2021 Winners List: ఉత్తమ చిత్రంగా నో మ్యాడ్‌ ల్యాండ్‌ - Sakshi
Sakshi News home page

Oscars 2021: ఉత్తమ చిత్రంగా నో మ్యాడ్‌ ల్యాండ్‌

Published Mon, Apr 26 2021 8:31 AM | Last Updated on Tue, Apr 27 2021 3:15 PM

Oscar 2021 : Winners List Inside - Sakshi

ఆస్కార్‌ అవార్డు.. జీవితంలో ఒక్కసారైనా దీన్ని గెలుచుకోవాలని ఉవ్విళ్లూరే సినీతారలు ఎందరో. అకాడమీ అవార్డు సాధిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరపడిపోతారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభమైంది.. కోవిడ్‌ కారణంగా మొట్టమొదటిసారి రెండు ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అటు డోల్బీ థియేటర్‌లో, మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో ఆస్కార్‌ 2021 అవార్డు విజేతలను ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 

ఇక అవార్డుల విషయానికి వస్తే.. నో మ్యాడ్‌ ల్యాండ్‌ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ క్లోవే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ వరించింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ దక్కింది.  బెస్ట్‌ రైటర్స్‌గా ‌ క్రిస్ట్‌ఫర్‌ హ్యాంప్టన్‌, ఫ్లోరియన్‌ జెల్లర్‌లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయకు ఆస్కార్‌ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటిగా యువాన్‌ యు జంగ్‌ (మిన్నారి సినిమా)కు అవార్డును ప్రకటించడంతో దక్షిణ కొరియాలోనే ఆస్కార్‌ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కారు.

ఆస్కార్‌ విజేతలు..

ఉత్తమ చిత్రం: నో మ్యాడ్‌ ల్యాండ్‌

ఉత్తమ నటుడు: ఆంటోని హాప్‌కిన్స్‌ (ద ఫాదర్‌)

ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌ (నో మ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ చిత్రం ఎడిటింగ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ దర్శకురాలు: క్లోవే జావో‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మెస్సయా)

ఉత్తమ సహాయ నటి: యువాన్‌ యు–జంగ్(మిన్నారి)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సినిమాటోగ్రఫి: మ్యాంక్‌

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: టెనెట్‌

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఇఫ్‌ ఎనీథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ 

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: మై ఆక్టోపస్‌ టీచర్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: సోల్‌

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: కొలెట్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: మ్యాంక్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: సోల్

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: ఫైట్‌ ఫర్‌ యూ (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య)

చదవండి: ఆస్కార్‌లో మన భారతీయ సినిమాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement