ఆస్కార్‌కి ది గుడ్ రోడ్
‘ది లంచ్ బాక్స్, భాగ్ మిల్కా భాగ్, ఇంగ్లిష్ వింగ్లిష్‌లాంటి హిందీ చిత్రాలతో పాటు ఉత్తరాదిన పలు చిత్రాలు, కమల్‌హాసన్ ‘విశ్వరూపం’తో కలిపి దక్షిణాదిన పలు చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ విభాగంలో నామినేషన్ ఎంట్రీకి పోటీపడ్డాయి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ అరుదైన అవకాశం ఏ చిత్రానికి దక్కుతుందా? అనే చర్చకు తెరపడింది. పోటీలో మొత్తం 22 చిత్రాలు నిలవగా, అన్నిటికన్నా ది బెస్ట్ ‘ది గుడ్ రోడ్’ అని కమిటీ నిర్ణయించింది.
మన భారతదేశం తరఫున ఈ గుజరాతీ చిత్రాన్ని నామినేషన్ ఎంట్రీకి పంపించడానికి ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు గౌతమ్ ఘోష్, ఇతర జ్యూరీ సభ్యులు నిర్ణయించారు. ఐదు గంటలు సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత ఏకగ్రీవంగా జ్యూరీ మొత్తం ‘ది గుడ్ రోడ్’కే ఓటేశారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది ఈ చిత్రం. కేవల్ కట్రోడియా, సొనాలీ కులకర్ణి, అజయ్ గేహి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు గ్యాన్ కొరియా దర్శకత్వం వహించారు.