ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోను | Jr NTR returns to Hyderabad after Oscar event | Sakshi
Sakshi News home page

ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోను

Published Thu, Mar 16 2023 5:14 AM | Last Updated on Thu, Mar 16 2023 7:36 AM

 Jr NTR returns to Hyderabad after Oscar event  - Sakshi

శంషాబాద్‌: ‘స్టేజీపై కీరవాణి, చంద్రబోస్‌ నిల్చుని ఆస్కార్‌ అందుకున్న క్షణాలను ఎన్నటికీ మరచిపోను.. అదే నా బెస్ట్‌ మూమెంట్‌’ అని సినీనటుడు జూ.ఎన్టీఆర్‌ అన్నారు. అమెరికా లాస్‌ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌ బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నాటు నాటు పాటకు ఆస్కార్‌ అందుకున్న అనుభవనం అనిర్వచనీయమైందన్నారు.

అందులో భాగస్వామిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. తెలుగువాడిగా.. భారతీయుడిగా గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్కార్‌ ఎంతో బరువుగా ఉందని, మన దేశం ఎంత బరువుగా ఉంటుందో అంతలా ఉందన్నారు. అనంతరం ఆయన ఓపెన్‌ టాప్‌ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ బయలుదేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement