కొలరాడో స్ప్రింగ్స్: దక్షిణ కొరియా తీసిన ‘పారాసైట్స్’సినిమాకు ఆస్కార్ అవార్డు ఇవ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ఒక విదేశీ చిత్రానికి అంత గౌరవం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘ఈ ఏడాది అకాడమీ అవార్డులు ఘోరంగా ఉన్నాయి..’అని ఆయన వ్యాఖ్యానించారు. కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘దక్షిణ కొరియాతో ఉన్న వాణిజ్య సమస్యలు చాలు.. వారికి ఈ ఏడాది ఉత్తమ చిత్రం అవార్డును ఎలా ప్రకటిస్తారు..’అని ప్రశ్నించారు. హాలీవుడ్ అతి పెద్ద వార్షిక బహుమతి ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఆంగ్లేతర భాషా చిత్రంగా పారాసైట్స్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పారాసైట్ సినిమాకు అవార్డు ఇవ్వడం మంచిదా? కాదా? అనేది తనకు తెలియదన్న ట్రంప్ తాను ఆ చిత్రాన్ని చూడబోనని చెప్పకనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment