
ఆస్కార్ రేస్‌లో ఆ రెండు చిత్రాలు
భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు అన్నది ఒక కలగానే మిగిలిపోయింది. అయితే ఆ అవార్డుల ఎంపికలో పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారనే భావనను చాలా మంది వ్య క్తం చేస్తున్నారు. అసలు మంచి చిత్రానికి ఆ స్కార్ అవార్డు కొలమానం కాదని కమలహాస న్ లాంటి నట దిగ్గజాలు అంటుంటారు. అయినా ప్రతిసారి ఆ అవార్డు కోసం ప్రయత్నిస్తూ భారతీయ సినిమా భంగ పడుతూనే ఉంది. ఏదేమయినా మరో సారి ఆ అవార్డు కోసం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.విశేషం ఏమిటంటే ఈ దఫా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ అవార్డు ల పోటీకి తయారవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విశేష ప్రజాదరణ పొందడంతో పా టు ప్రపంచ సినిమా దృష్టిని తమ వైపు తిప్పుకున్నవే.
అందులో ఒకటి భారతీయ సినీ చరి త్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్లలోనూ చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రం కాగా రెండవది ఎలాంటి చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేని అతి తక్కువ కాస్ట్‌తో చాలా చిన్న చిత్రంగా రూపొంది సంచలనాలను న మోదు చేసుకున్న కాక్కముట్టై. నటుడు ధనుష్ వుండర్‌మార్ ఫిలింస్,దర్శకుడు వెట్రి మారన్ గ్రాస్‌రూట్, ఫాక్స్ స్టూడియో సంస్థలు సం యుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకు డు మణికంఠ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇక విఘ్నేశ్, రమేష్ అనే నటనంటే తెలియని చిన్న పిల్లలు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడంతో పాటు జాతీయ అవార్డులను కొల్లగొట్టిందన్న విషయం తెలిసిందే.ఇక బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బ్రహ్మాండానికే బ్రహ్మాండంగా నిలిచిన చిత్రం ఇది.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అద్భుత సృష్టి బాహుబలి.అలా అబ్బుర పరచిన ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు భారతీయ చిత్రాల ఎంపిక జూరీ బృందానికి ప్రముఖ నటుడు,దర్శకుడు అమోల్ పాలేకర్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇటీవల ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చి 45 భారతీయ చిత్రాలను పరిశీలించి ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు కొన్ని చిత్రాలను ఎంపిక చేసినట్లు సమాచారం.వాటిలో కోలీవుడ్‌కు సంబంధించి కాక్కముట్టై,టాలీవుడ్ చిత్రం బాహుబలి చిత్రాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు అమీర్‌ఖాన్ నటించిన పీకే,విశాల్ బరద్వాజ్ చిత్రం హైదర్, ప్రియాంకచోప్రా మేరీకోమ్, నీరజ్ చిత్రం మసాన్ తదితర చిత్రాలు ఉన్నట్లు సమాచారం. 88వ అస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల వివరాలను సెప్టెంబర్ 25న అధికారకపూర్వంగా వెల్లడించనున్నారు.