ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీకి ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే అది నటనలో కాదు.. పోరాటంలో!. హాలీవుడ్ ప్రముఖ నటుడు సీన్‌పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒక దానిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్‌స్కీకి ప్రదానం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ని సందర్శించడానికి వచ్చిన పెన్ ఈ అవార్డుని జెలెన్‌స్కీకి అందించారు.
తాను జెలెన్‌స్కీని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా కలిశానని అన్నారు సీన్‌పెన్. ‘‘ఆయన ఈ యుద్ధం కోసమే పుట్టాడు కాబోలు అన్నారు. అతని అంతులేని ధైర్యం, తెగువకు తాను ఫిదా అయ్యాను’’ అంటూ జెలెన్ స్కీపై ప్రశంసలు గుప్పించారు సీన్‌పెన్. అతను ఉక్రెయిన్లను ఒకతాటిపైకి తీసుకువచ్చి ఏకీకృతం చేయు విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు పెన్. ఆయన ఉక్రెయిన్ల ప్రతిబింబం అని కొనియాడాడు.
అలాగే జెలన్‌స్కీ పెన్‌కి తమ దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను ప్రధానం చేశారు. పెన్ ప్రపంచ స్థాయి నటుడిగానే కాకుండా రాజకీయ క్రియశీలత పరంగా కూడా మంచి పేరు ఉంది ఈ మేరకు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల సలహాదారు మంత్రి అంటోన్ గెరాష్చెంకో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికన్ నటుడి సీన్‌పెన్‌ని కలిసిన వీడియోను సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. 62 ఏళ్ల వయసున్న సీన్‌పెన్.. తన కెరీర్‌లో ఇప్పటిదాకా ఐదు ఆస్కార్‌లను ఉత్తమ నటుడు కేటగిరీ కింద అందుకున్నారు.
Sean Penn has given his Oscar to Ukraine - @ZelenskyyUa
— Anton Gerashchenko (@Gerashchenko_en) November 8, 2022
Thank you, sir!
It is an honor for us. pic.twitter.com/vx2UfEVTds
(చదవండి: ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో అత్యధికులు భారత్‌లో పుట్టిన వారే)
Comments
Please login to add a commentAdd a comment