
కోవై ఎన్నారైకు ఆస్కార్ అవార్డు
కేకేనగర్: కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీకు చెందిన కిరణ్‌భట్ (41)కు సైన్స్ సాంకేతిక పరిజ్ఞాన విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఆయనకు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ మంగళవారం ప్రకటించింది. హాలీవుడ్ చిత్రాలైన అవెంజరస్, స్టార్ వర్సెస్ రాక్ వన్ తదితర చిత్రాల్లో కథా పాత్రల ముఖభావాలను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో మార్పులు చేసినందుకుగానూ ఈ అవార్డు ఆయనకు దక్కింది. కిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.