
లఘు చిత్రంలో రహమాన్
జంట ఆస్కార్ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగీతదర్శకుడు ఎ.ఆర్. రహమాన్ జీవితం చాలామందికి ఆదర్శం అనే చెప్పాలి. అందుకే ఆయన జీవిత చరిత్రను లఘు చిత్రంగా దర్శకుడు ఉమేష్ అగర్వాల్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ‘జైహో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నెల 25న న్యూయార్క్‌లోని ‘మ్యూజియమ్ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’లో ఈ చిత్రాన్ని ప్రద ర్శించనున్నారు. రహమాన్‌తో కలిసి పనిచేసిన మణిరత్నం, శేఖర్‌కపూర్, డానీ బోయల్ ఆయనతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఈ చిత్రంలో వెల్లడించారట!