తమిళ్ స్లమ్ డాగ్ ఒరు కుప్పై క థై
స్లమ్ డాగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డులను అందించిన చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి తమిళ స్లమ్ డాగ్ చిత్రంగా ఒరు కుప్పై కథై ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి. దర్శకులు ఎళిల్, అస్లామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఈయనకిది తొలి చిత్రం తన గురువుల్లో ఒకరైన అస్లామ్ నిర్మాతగా మారి తన ఫిలిం బాక్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నృత్య దర్శకుడు దినేష్ కథా నాయకుడిగా పరిచయం అవుతున్నారు.
వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ చెయ్ వీరే చిత్రాల ఫేమ్ మనీషా యాదవ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ నృత్య దర్శకుడు దినేష్ నటించిన హీరో పాత్రను దర్శకుడు అమీర్, సముద్రకణి, మిష్కిన్ నటించాలని కోరుకున్నారన్నారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే ఒక చిన్న అంశాన్ని ఇంకా చెప్పాలంటే ఒక చెత్త లాంటి విషయాన్ని పద్ధతిగా చేస్తే అది ఎంత దూరం పోతుంది? పరిణామాలు ఎంత తీవ్రంగా మారుతాయి అని చెప్పే కథ ఒరు కుప్పై కథ చిత్రం అన్నారు.
నవ దంపతుల మధ్య తలెత్తిన చిన్న సమస్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్న అంశాన్ని సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని చెప్పారు. కాదల్, కల్లూరి చిత్రాల ఫేమ్ జోష్యా శ్రీధర్ సంగీతాన్ని అంజాదే చిత్రం ఫేమ్ మహేష్ ముత్తుస్వామి చాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు వెల్లడించారు.