నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్ | Rahman Productions 99 songs Movie First Look | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్

Published Thu, Mar 10 2016 10:44 AM | Last Updated on Mon, Aug 20 2018 3:51 PM

నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్ - Sakshi

నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్

తన సంగీతంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్వర సంచలనం ఏఆర్ రెహమాన్. భారతీయ భాషలన్నింటిలో అద్భుతమైన పాటలు అందించిన రెహమాన్ అంతర్జాతీయ వేదికల మీద కూడా సత్తా చాటాడు. అంతేకాదు గ్రామీ, అకాడమీ అవార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం అందుకున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెహహాన్ సంగీతంతో పాటు స్వయంగా కథను కూడా అందిస్తున్నాడు. '99 సాంగ్స్' పేరుతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను, రెహమాన్ తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో రూపొందించిన ఈ పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement