
పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్
లాస్ ఏంజెలెస్: ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల్లో పాకిస్థాన్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. 88వ అకాడమీ అవార్డుల్లో 'ఏ గాల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్ గివ్ నెస్' ఉత్తమ డాక్యుమెంటరీ-షార్ట్ సబ్జెక్ట్ గా ఎంపికైంది. పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్ షర్మీన్ ఒబైడ్-చినాయ్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. పరువు హత్యలు నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
ఇది తనకు దక్కిన రెండో ఆస్కార్ పురస్కారమని చినాయ్ తెలిపారు. అంతకుముందు 2012లో 'సేవింగ్ ఫేస్'కు ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు. పాకిస్థాన్ యాసిడ్ బాధితులకు సంబంధించిన కథాంశంతో 'సేవింగ్ ఫేస్' తెరకెక్కించారు.