సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మీద ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్ శంకర్, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం దసరా అలాంటి కోవకే చెందుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కమర్షియల్గానూ మంచి విజయం సాధిస్తున్నాయి
ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపించడంపై మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి మెసెజ్ చేశారు. ‘డియర్ కేటీఆర్ గారు. మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహరణకు బలగం, దసరా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుంది.
మరో విషయం ఏంటంటే నాకు 68 ఏళ్లు.. ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లు, జోకర్స్ గా చూపిచండంతో.. గత 20 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశాను’ అని డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కేటీఆర్‌కు వాట్సాప్ మెసెజ్ చేశారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అనుమతితో మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. దీనికి శ్రీరాములు కూడా స్పందింస్తూ.. తప్పకుండా సర్. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను. మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం. థాంక్యూ వెరి మచ్ సర్ అంటూ పేర్కొన్నారు.
దీనిని కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంది’ అని కేటీఆర్ తెలిపారు.
Messages like this 👇😊
— KTR (@KTRBRS) April 1, 2023
Thanks to KCR Garu for the renaissance on the cultural front
A dialect that was ridiculed is now taking centerstage 👍 pic.twitter.com/XuWZBxiYRF
Comments
Please login to add a commentAdd a comment