సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి గట్టికౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల వైఖరిని పోలుస్తూ 10 అంశాలను ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, కేసీఆర్ ఖేల్ ఖతం–బీఆర్‌ఎస్ దుకాణ్ బంద్’అని ఆ ట్వీట్‌లో వెల్లడించారు. తమ డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాల్లో గుణాత్మక మార్పునకు డిక్లరేషన్ అని ఆ ట్వీట్‌లో రేవంత్ స్పష్టం చేశారు.
ట్వీట్‌లో పేర్కొన్న అంశాలు
♦ మా డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం కాదు ళీ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం కాదు
♦ గిరిజన రిజర్వేషన్లు 12 శాతం పెంచుతామని మోసం చేయడం ళీ మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం ళీ నేరెళ్ల ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం
♦ కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం
♦ మరియమ్మను లాకప్‌డెత్ చేయడం లాంటిది కాదు
♦ కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకొని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం కాదు ళీ ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేయడం కాదు
♦ దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తి పడడం కాదు
కాంగ్రెస్‌లో చేరిన నాగర్‌కర్నూల్, అచ్చంపేట నేతలు
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ దళిత, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గ్రామ గ్రామాన తిరిగి ప్రతి తలుపూ తట్టాలని, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment