నాని ‘దసరా’కోసం 12 ఎకరాల్లో భారీ సెట్‌.. ఖర్చు ఎంతంటే..? | Huge Set For Nani Dasara Movie | Sakshi
Sakshi News home page

నాని ‘దసరా’కోసం 12 ఎకరాల్లో భారీ సెట్‌.. ఖర్చు ఎంతంటే..?

Published Thu, Jan 27 2022 4:46 PM | Last Updated on Thu, Jan 27 2022 4:47 PM

Huge Set For Nani Dasara Movie - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో చాలా గ్యాప్‌ తర్వాత థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు నాని. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు నానికి మంచి పేరుని సంపాదించిపెట్టింది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత ‘అంటే సుందనానికి..’పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాడు నాని. ఇటీవల షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేశాడు.

(చదవండి: అరుదైన రికార్డు నెలకొల్పిన శ్యామ్​ సింగరాయ్​)

త్వరలోనే మరో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. శ్రీకాంత్‌ ఓదేల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘దసరా’అని టైటిల్‌ పెట్టారు. నాని పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తుంది చిత్రబృందం. ఈ సినిమా కోసం ప్రతేకంగా విలేజ్‌ సెట్‌ని ఏర్పాటు చేయబోతున్నారట. దీని కోసం ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 12 ఎకరాల్లో ఈ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నారట. ‘శ్యామ్‌ సింగరాయ్‌’కోసం కోల్‌కతా సెట్‌ని తీర్చిదిద్దిన ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్ల ఈ సెట్‌ని రూపొందించబోతున్నారు. సినిమాలోని కీలక సన్నీవేశాలను ఈ సెట్‌లోనే చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement