దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్స్‌లో నాని సందడి చేయనున్నాడు. అంతే కాదు, ఈ వేదిక మీద సింగర్ కార్తికేయ నాని మనసు గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ సందర్భంగా పలకరించడం ఆనందంగా ఉందని అన్నారు నాని. తన దసరా ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అయిన సందర్భంగా అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవడం హ్యాపీగా ఉందని చెప్పారు నేచురల్ స్టార్.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2కి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2. సంగీత ప్రపంచంలో ప్రముఖులైన హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ దడ్లానీ, జీవీ ప్రకాష్ తో పాటు ఎంతో మందిని తమ గళాలతో మెప్పిస్తున్నారు గాయనీ గాయకులు. అటు నేచురల్ స్టార్ నాని, ఇటు ఎస్పీ చరణ్ ముఖ్య అతిథులుగా ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ సంగీతాభిమానులకు పండగలా ఉంటుంది.
"DHARANI DHUNNESAADANTHE", EE VAARAM TELUGU INDIAN IDOL LO MEE, MAA, MANA NANI...🔥🔥🔥 DON'T MISS THE BLOCKBUSTER ENTERTAINMENT THIS FRI-SAT AT 9PM.#TeluguIndianidol2@NameisNani @charanproducer @MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem @southindiamalls pic.twitter.com/q5WQSiBFH1
— ahavideoin (@ahavideoIN) April 4, 2023
Comments
Please login to add a commentAdd a comment