
Nani's Dasara Movie: నాని మంచి జోరు మీదున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘అంటే.. సుందరానికీ!’ చిత్రం షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేసిన ఆయన తర్వాతి చిత్రం ‘దసరా’పై దృష్టి పెట్టారు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం 12 కోట్ల బడ్జెట్‌తో పల్లె వాతావరణం సెట్‌ని రూపొందిస్తున్నారట. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం ఐదెకరాల్లో కోల్‌కత్తా సెట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన అవినాష్ కొల్ల ‘దసరా’ కోసం విలేజ్ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో గ్రామీణ నేపథ్యం ఉట్టి పడేలా సెట్ రూపొందిస్తున్నారని తెలిసింది. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. అందుకు తగ్గట్లుగానే సెట్‌ని తీర్చిదిద్దుతున్నారట అవినాష్. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment