‘దసరా’సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 విడుదలైన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించి, నాని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ‘దసరా’విజయంతో నాని కాన్పిడెన్స్ మరింత పెరిగింది. వైవిధ్యమైన సినిమాలు తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని అర్థమైంది. అందుకే ఇకపై వైవిధ్యమైన కథలనే ఎంచుకోవాలని నాని డిసైడ్ అయ్యారట. అంతేకాదు దసరా సక్సెస్‌తో తన పారితోషికాన్ని కూడా పెంచేశారట.
వాస్తవానికి దసరా చిత్రానికి ముందే నాని తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 22 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక ‘దసరా’ తో నాని మార్కెట్ వ్యాల్యూ పెరిగిపోయింది. దీంతో తన పారితోషికాన్ని కాస్త పెంచేశాడట. ఇకపై కమిట్ అయ్యే చిత్రాలకు రూ. 25 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
దసరా’ రిలీజ్‌కు ముందే కొత్త నిర్మాత మోహన్ చెరుకూరితో తన 30వ చిత్రాన్ని నాని ప్రకటించాడు. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న మరో చిత్రంలో నటించడానికి కూడా నాని ఓకే చెప్పేశాడు. దీనికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా..ఇకపై కమిట్ అయ్యే సినిమాలకు నాని ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకునే నిర్మాతలు కూడా నాని రెమ్యునరేషన్ కు ఓకే చెప్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment