Keerthy Suresh Hikes Her Remuneration After Dasara Movie Success, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన ‘మహానటి’.. ఎన్ని కోట్లో తెలుసా?

Published Wed, Jul 19 2023 10:46 AM | Last Updated on Wed, Jul 19 2023 12:18 PM

Keerthy Suresh Hikes Her Remuneration - Sakshi

పాత్రల కోసం మేకోవర్‌ అయ్యే నటిమణుల్లో  కీర్తి సురేష్‌ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కేరళా బ్యూటీ ఆరంభ దశలోనే తెలుగులో ‘మహానటి’ చిత్రంలో దివంగత మహా నటి సావిత్రి నిజజీవిత పాత్రతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. తన అద్భుతమైన అభినయానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు, స్టార్స్‌తో జత కట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి.

కాగా ఆ మధ్య సరైన సక్సెస్‌ లేక కీర్తీసురేష్‌ కొంత వెనుకబడ్డారు. దీంతో తెలుగులో అవకాశాలు కొరవడ్డాయి. అయితే తమిళంలో ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా ఫ్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్‌కు ఇటీవల నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇక తమిళంలో సమీపకాలంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామనిదన్‌ చిత్రం సక్సెస్‌ అయ్యింది .

హిట్స్‌ ఉత్సాహాన్నే కాదు పారితోషికాన్నీ పెంచుతాయి. కీర్తిసురేష్‌ ఇందుకు అతీతం కాదు. తన పారితోషికాన్ని ఇప్పుడు భారీగా పెంచేసిందని సమాచారం. ఇంతకు ముందు చిత్రానికి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈమె తమిళంలో తాజాగా కన్నివెడి అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాక తఘుతాత, సైరన్‌ తదితర చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి.

(చదవండి: ఎట్టకేలకు బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న కీర్తి సురేశ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement